విజయకాంత్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న విజయ్.. చెప్పు విసిరిన గుర్తుతెలియని వ్యక్తి

విజయకాంత్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న విజయ్.. చెప్పు విసిరిన గుర్తుతెలియని వ్యక్తి

తమిళ నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌(71) గురువారం (డిసెంబర్‌ 28న) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం చెన్నైలోని ఐల్యాండ్‌ గ్రౌండ్‌లో ఉంచగా.. అభిమానులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు.

ఈక్రమంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి గురువారం రాత్రి విజయకాంత్‌ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అక్కడి నుండి తిరిగి వెళుతున్న సమయంలో విజయ్ కి చేదు అనుభవం ఎదురైంది. గుర్తు తెలియని వ్యక్తి విజయ్ మీదకు చెప్పు విసిరాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ మండిపడుతున్నారు. అలాంటి పరిస్థితిలో ఇలాంటి చర్యలకు పాల్పడటం మంచిది కాదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజయ్ మీదకు చెప్పు విసిరిన వ్యక్తి ఎవరు? ఎందుకు విసిరాడు? అనే వివరాలు ఇంకా తెలియలేదు.

Actor #Vijay was attacked by some unidentified persons in the #Vijayakanth funeral place ?#Captain #RIPVijayakanth pic.twitter.com/lmrmRr1WVR

— AK (@iam_K_A) December 29, 2023