Director Sunny Sanjay: ‘అనగనగా’తో డైరెక్టర్ దశ తిరిగింది.. టాలీవుడ్ బడా బ్యానర్స్లో వరుస సినిమాలు!

Director Sunny Sanjay: ‘అనగనగా’తో డైరెక్టర్ దశ తిరిగింది.. టాలీవుడ్ బడా బ్యానర్స్లో వరుస సినిమాలు!

శ్రీవిష్ణు హీరోగా సితార ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘అనగనగా’ ఫేమ్ సన్నీ సంజయ్ (Sunny Sanjay) దర్శకత్వం వహిస్తున్నాడు. బుధవారం (నవంబర్ 5న) అందులో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘ప్రతి యువకుడి కథ’ అనే ట్యాగ్‌‌లైన్‌‌తో వచ్చిన అనౌన్స్‌‌మెంట్‌‌ పోస్టర్‌‌‌‌ ఇంప్రెస్ చేసింది.

తనదైన కామెడీ టైమింగ్‌‌తో మెప్పించే శ్రీవిష్ణు.. ఫీల్‌‌ గుడ్ ఎమోషన్స్‌‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కొత్తగా కనిపించబోతున్నాడని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. సూర్యదేవర నాగవంశీ,  సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌‌కు వెళ్లబోతోంది. నటీనటులు, టెక్నీషియన్స్‌‌ సహా ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. 

డైరెక్టర్ సన్నీ సంజయ్:

 ‘అనగనగా’ మూవీ సక్సెస్తో డైరెక్టర్ సన్నీ సంజయ్ వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఈటీవీ విన్ వంటి మూడు బడా బ్యానర్లు.. డైరెక్టర్ సన్నీ సంజయ్తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నాయని సినీ వర్గాల టాక్. ఇందులో ఇప్పటికే, ఈటీవీ విన్కి స్క్రిప్ట్ని లాక్ చేసాడట.

ఇపుడు సితార బ్యానర్లో శ్రీ విష్ణుతో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ బ్యానర్లో సినిమాలు కంప్లీట్ అయ్యేలోపుగా మైత్రి బ్యానర్ నుంచి మరో సినిమా కూడా వచ్చే ఛాన్స్ ఉందని టాక్. అంతేకాకుండా, తమ బ్యానర్లో సినిమాలు తెరకెక్కించడానికి, ముందుగానే సన్నీ సంజయ్కి భారీ పారితోషికం ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. "ఒక్క ‘అనగనగా’ మూవీతో వరుసబెట్టి సినిమాల ఛాన్సెస్.. దశ తిరిగిన కొత్త డైరెక్టర్ ప్రయాణం.."అంటూ నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు.

‘అనగనగా’ మూవీ గురించి: 

‘అనగనగా’ మూవీ.. విద్యా వ్యవస్థ మారాలని తెరకెక్కిన సినిమా ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది సినిమా కాదు, ఒక జీవితం అని చెప్పాలి. ఎమోషన్స్, ఎథిక్స్, లైఫ్ వంటి అంశాలతో వచ్చి ఆలోచింపజేసింది. సమాజంలో విద్య బోధనపై నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, విద్యావ్యవస్థలోని లోపాలు, విద్యా బోధనలో ఉండే వైపరీత్యాలపై సున్నితంగా సెటైర్లతో ఈ సినిమా తెరకెక్కింది.

కార్పొరేట్ విద్యావ్యవస్థలోని లోపాలను కళ్ళకి కట్టినట్లుగా చూపించింది. ఈ సినిమాకు చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రేక్షకుల నుంచి ప్రశంసలను దక్కించుకుంది. ముఖ్యంగా హీరో సుమంత్ యాక్టింగ్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.