
'బేబీ'సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట మరోసారి కలిసి నటిస్తున్నారు. ‘90s’ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ జంటతో ఓ సినిమా చేస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో ఆకట్టుకుంది.
‘90s’ వెబ్ సిరీస్‌లో ‘‘సాంప్రదాయిని.. సుబ్బిని.. సుద్దపూసని..’ అంటూ ఇంప్రెస్ చేసిన చిన్న పిల్లవాడి పాత్ర పదేళ్ల తర్వాత పెద్దవాడై, అతనికి ఓ ప్రేమకథ ఉంటే ఎలా ఉంటుందనేది ఈ మూవీ స్టోరీగా చూపించారు. ఆనంద్ దేవరకొండ ఆ పాత్రను పోషిస్తుండగా, అతనికి జంటగా వైష్ణవి నటించనుంది.
‘‘మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు... మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ” అంటూ ఆనంద్ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కామెడీ, రొమాన్స్ కలగలిసిన ఎమోషనల్ డ్రామా ఇదని మేకర్స్ తెలిపారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.
ఇది నా స్టోరీ?
— Sithara Entertainments (@SitharaEnts) January 15, 2025
మీ స్టోరీ?
మన స్టోరీ ♥️
Bringing you the ???? ????????? ??? ???????????? ?????? ????? ???? ????? with a character you’ll fall in love with instantly ??
- https://t.co/OnsQpZTaA6 @SitharaEnts Production No. 32… pic.twitter.com/4vSJI8IUJW