యాడ్ షూట్లో హీరో సీరియస్.. ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్

యాడ్ షూట్లో హీరో సీరియస్.. ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సెలబ్రిటీల్లో ఒకరు ఆనంద్ మహీంద్రా. సామాజిక అంశాలపై స్పందించడమే కాదు.. అవసరమైన వారికి తనవంతు సాయం చేస్తుంటారు. ముఖ్యంగా ట్విట్టర్లో ఆయన చేసే ఫన్నీ ట్వీట్లు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా తమ కంపెనీ యాడ్ షూట్లో సిబ్బందిపై సీరియస్ అయిన హీరో అజయ్ దేవ్గన్ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసి ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు. 

మహీంద్రా ట్రక్ బస్ షూట్లో పాల్గొంటున్న అజయ్ దేవ్గన్ పదే పదే స్క్రిప్ట్లో ఎందుకు మార్పులు చేస్తున్నారని కెమెరావైపు ఓ సీరియస్ లుక్ ఇస్తాడు. బార్ బార్ నహీ సిర్ఫ్ చార్ బార్ (పదే పదే కాదు.. నాలుగుసార్లే) అన్న వాయిస్ వినబడుతున్న చిన్న వీడియో క్లిప్ను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో షేర్ చేశారు. మహీంద్రా ట్రక్ బస్ షూటింగ్ లో అజయ్ దేవ్గన్కు కోపం వచ్చినట్లు తెలిసింది. మా ట్రక్ లో ఆయన నా కోసం రాకముందే ఊరు వదిలి పారిపోతానంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు.