పొద్దున్నే నన్ను ఏడిపించారు..ఆనంద్ మహీంద్రా వీడియో

పొద్దున్నే నన్ను ఏడిపించారు..ఆనంద్ మహీంద్రా వీడియో

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహింద్రా.. అందరినీ ఆకర్షించే, ఆలోచింపచేసే, సరదా పోస్టులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అయింది. పొద్దున్నే తనను ఏడిపించేశారని ఓ వీడియోను పోస్ట్ చేశారు తన ట్విట్టర్లో.  ప్రతి ఒక్కరీ హార్ట్ టచ్ చేసేలా సింప్లీ సూపర్బ్ గా ఉంది ఈ వీడియో. వీడియోలోకి వెళ్తే ఒక తాత ప్రతీరోజు బరువులు ఎత్తడం ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఈ వయసులో ఎందుకిలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. అందరూ ఎక్స్ర్ సైజ్ చేస్తున్నారేమోనని అనుకుంటారు.  సీన్ కట్ చేస్తే  క్రిస్మస్ సందర్భంగా తన మనవరాలిని కలుస్తాడు. మనవరాలికి ఓ గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ ప్యాకెట్ లో క్రిస్మస్ చెట్టుకు అలంకరించే ఓ స్టార్ ఉంటుంది. తానే మనువరాలిని పైకెత్తి  క్రిస్మస్ చెట్టుపై స్టార్ ను పెట్టిస్తాడు. అప్పుడు అందరికీ అర్థమవుతుందని ఆ తాత ఎందుకు బరువులు ఎత్తడం ప్రాక్టీస్ చేశారోనని.  క్రిస్మస్ రోజు మనువరాలిని ఎత్తుకోవాలన్న ఉద్దేశంతో ముందుగానే ఆయన ప్రాక్టీస్ చేశాడు. మనవరాలిని ఎత్తే శక్తి ప్రస్తుతం తనలో లేదని, బరువులు ఎత్తడం ప్రాక్టీస్ చేస్తే పండుగ లోపు సిద్ధమవుతానని..ఎక్సర్ సైజ్ చేశాడు ఆతాత. వాస్తవానికి ఇదోక యాడ్. ఈ యాడ్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఈ వీడియో పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా పొద్దున్నే నన్ను ఏడిపించేశారు. తనకు మనవరాలు లేదు కానీ..అంతటి మనవడు ఉన్నారని ట్వీట్ చేశారు.

నన్ను కొనగలిగే వ్యక్తి ఇంకా పుట్టలేదు