47 ఏళ్ల కిందటి ఫోటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

47 ఏళ్ల కిందటి ఫోటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా సోషల్ ఇష్యూస్ పై బాగా స్పందింస్తుంటారు. ట్విట్టర్ లో ఆయన పోస్టులకు లక్షల్లో లైక్స్, వ్యూస్ వస్తుంటాయి. తాజాగా 47 ఏళ్ల కిందటి ఫోటోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఆనంద్ మహీంద్రా పోస్ట్ కు వేలల్లో లైక్స్ వస్తున్నాయి. చాలా మంది రీ ట్వీట్ చేస్తున్నారు. 

ఇక తన ఫోటో గురించి ఆనంద్ మహీంద్రా వివరిస్తూ... ‘‘1975 లో ఫోటోగ్రఫీ స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్పెయిన్ లోని టోలెడో లో ఈ ఫోటో తీశా. ప్రపంచ వ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ విస్తురిస్తున్న నేపథ్యంలో నోటిమాట అనేది అత్యంత ముఖ్యమైన కమ్యూనికేషన్ సాధనం అని ఈ ఫోటో నాకు గుర్తు చేసింది’’ అని రాసుకొచ్చారు. ఇకపోతే, వైరల్ అవుతున్న ఆ ఫోటోలో స్థానికులు ఒకరితో ఒకరు తెగ మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ ఫోటోకు ఇప్పటి వరకు 5వేలకు పైగా లైక్స్ రాగా... వందల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. బ్యూటీఫుల్ పోటో సర్ అంటూ కొంతమంది యూజర్లు కామెంట్ చేయగా... మీలో చాలా మంచి ఫోటోగ్రఫీ స్కిల్స్ ఉన్నాయి అంటు మరికొంత మంది అంటున్నారు.