కార్లపై జీఎస్టీ తగ్గిస్తే.. ఆర్థిక వ్యవస్థకు మేలు

కార్లపై జీఎస్టీ తగ్గిస్తే..  ఆర్థిక వ్యవస్థకు మేలు

ట్వీట్ చేసిన ఆనంద్ మహింద్రా

న్యూఢిల్లీ : ఆటోమొబైల్స్‌‌పై జీఎస్టీ తగ్గిస్తే ఆర్థికవ్యవస్థకు మేలు చేకూరుతుందని మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా చెప్పారు. గత  కొన్ని నెలల నుంచి కంటిన్యూగా ఆటో మొబైల్స్ అమ్మకాలు క్షీణిస్తూ వస్తున్నాయి. ప్యాసెంజర్ వెహికిల్ సేల్స్‌‌ కూడా మే నెలలో భారీగా 20 శాతానికి పైగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో  జీఎస్టీ రేటును తగ్గించాలని మహింద్రా కోరారు. చిన్న కంపెనీలు, ఉద్యోగాలపై ఆటో ఇండస్ట్రీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, జీఎస్టీ తగ్గిస్తే వారికి సాయం చేసినట్టవుతుందని పేర్కొన్నారు.

జీఎస్టీ తగ్గిస్తే.. ఇండియన్ ఆటో ఇండస్ట్రీ వృద్ధి మళ్లీ పరుగులు పెడుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఎఫ్‌‌ఏడీఏ) మాజీ ప్రెసిడెంట్ జాన్ కే పాల్‌‌ ఆటో ఎన్‌‌క్లేవ్‌‌లో అన్నారు. ఈ విషయాన్ని కోట్ చేస్తూ ఆటోమొటివ్ మ్యాగజైన్ ‘ఆటోకార్ ప్రొఫిషెనల్’ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌‌కు ప్రతిస్పందనగా ఆనంద్ మహింద్రా మరో ట్వీట్ చేశారు. ఇండియాలో ఆటో ఇండస్ట్రీ మూడో అతిపెద్ద ఎంప్లాయర్‌‌‌‌గా ఉంది. ఈ నెల మొదట్లో సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ(సియామ్) కూడా అన్ని వెహికిల్స్‌‌పై జీఎస్టీని ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని కోరింది.