ఆనంద్ మహీంద్రా ట్వీట్: ఇది ఎలిఫెంట్ కాదు.. ఎలీ-ప్యాంట్

ఆనంద్ మహీంద్రా ట్వీట్: ఇది ఎలిఫెంట్ కాదు.. ఎలీ-ప్యాంట్

మహీంద్రా గ్రూప్‌ అధినేత  ఆనంద్ మహీంద్రా  సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‏గా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. తన దృష్టికి వచ్చిన అద్భుత విషయాలు, వింత ఫోటోలు,  వీడియోలను నెటిజన్లతో పంచుకుంటారు. తాజాగా.. అందంగా ముస్తాబైన ఓ ఏనుగు ఫొటోను మహీంద్రా తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్‌ చేశారు. దానికి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు.”ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా. ఇది ఎలిఫెంట్ కాదు. ఎలీ-ప్యాంట్..” అంటూ ట్వీట్‌ చేశారు.  ఈ ఫొటోలో ఏనుగు పర్పుల్‌ కలర్‌ షర్ట్‌, వైట్‌ ప్యాంట్‌తో పాటు బ్లాక్‌ బెల్టును ధరించి మావటి వెనకాలే వెళ్తున్నది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

మార్చి 3న ఆనందం మహీంద్రా షేర్ చేసిన ఆ పిక్‌కు ఇప్ప‌టికే 29వేల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. సోష‌ల్ మీడియా యూజ‌ర్లు ఆ పిక్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏనుగు భ‌లే మోడ్ర‌న్ డ్రెస్ వేసిందే.. అని ఒక యూజ‌ర్ కామెంట్ చేయ‌గా.. ఏనుగు ప్యాంట్ తొడుక్కుంది, మావ‌టి లుంగీ ధ‌రించాడు.. అని ఇంకో యూజ‌ర్ కామెంట్ చేశాడు. ఇలా ర‌క ర‌కాల ఫ‌న్నీ కామెంట్స్ వ‌స్తున్నాయి.