Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది 

Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది 

గీతామాధురి భర్త నందు హీరోగా సవారి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సాహిత్ మోత్కూరి (Sahitmothkhuri). ఫస్ట్ మూవీతోనే మంచి కంటెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సాహిత్..మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ పొట్టెల్ (Pottel). 

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ను యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా రిలీజ్ చేశారు.విలేజ్ కల్చర్ ను..సాంప్రదాయక పద్దతులను చూపిస్తూనే రా అండ్ రస్టిక్ ఇంపాక్ట్ ఇస్తోంది.ఒక పేద కుటుంబాన్ని టార్గెట్ చేసిన ఒక ధనిక వ్యక్తి కథగా సాగుతోంది.

అందులో భాగంగానే 'మీరు చదువుకుంటే పటేలు,పనోడు ఒక్కటైతరు అంటే..ఎలా చదువుకోనిస్తా? అంటూ అజయ్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది.ఇక సినిమాలో పొట్టేలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండడంతో పొట్టేలు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు అర్ధమవుతోంది.శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూజ్ బంప్స్ వచ్చేలా టీజర్ కి  హైలెట్ గా నిలిచింది. 

ఎన్ ఐ ఏ ఎంటర్టైన్మెంట్స్ నిశాంత్ రెడ్డి, కుడికి ప్రగ్యా సన్నిధి క్రియేషన్స్ సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా పొట్టెల్ మూవీని  నిర్మిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా ప్రయాణం కొనసాగిస్తూ..వరుస సినిమాలు చేస్తోన్న సాహిత్ ఈ సినిమాతో హిట్ తెచ్చుకోవడం కన్ఫమ్ అనేలా టీజర్ చూస్తే అర్ధం అవుతోంది. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సేన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.