
మల్లేశం బ్యూటీ అనన్య ‘బహిష్కరణ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. హీరోయిన్ అంజలి ఇందులో మరో కీలక పాత్రలో కనిపించనుంది. ముఖేశ్ ప్రజాపతి అనే కొత్త దర్శకుడు దీనిని తెరకెక్కించాడు. ఇక రీసెంట్గా అనన్య బర్త్‌డే స్పెషల్ లుక్ రిలీజైంది. మల్లేశం సినిమాలో పల్లెటూరి యువతిగా చీర కట్టుతో కనిపించిన అనన్య ఆ తర్వాత గ్లామరస్ ఫొటో షూట్స్‌తో ఓ రేంజ్ పాపులారిటీని తెచ్చుకుంది.
తాజాగా మరోసారి ఆమె పల్లెటూరి పిల్లలా కనిపించనున్నట్టు తెలుస్తోంది. తాజా పోస్టర్లో చేతిలో లంగావోణి కట్టి నవ్వులు చిందిస్తోంది. ఇటీవల అంజలి సైతం ఇలాంటి పోస్టర్లోనే కనిపించింది. అయితే, ఈ రెండు పోస్టర్స్‌లో హీరోయిన్స్ కంచెకు అవతలే ఉన్నట్టు చూపించారు. ఈ కాన్సెప్ట్ సినీ లవర్స్‌లో ఆసక్తి పెంచుతోంది.