పోరాట యోధురాలుని స్మరించుకున్న.. నటి అనసూయ

పోరాట యోధురాలుని స్మరించుకున్న.. నటి అనసూయ

బుల్లితెర యాంకర్ గానే కాక నటిగానూ ప్రూవ్ చేసుకుంది అనసూయ(Anasuya). క్షణం, రంగస్థలం, విమానం లాంటి చిత్రాల్లో తన నటనకి ప్రేక్షకుల నుండి కాంప్లిమెంట్స్‌ దక్కాయి. లేటెస్ట్ గా అనసూయ సోషల్​మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోస్ ఆసక్తి కలిగిస్తోన్నాయి. రేపు (ఆగస్టు 15) ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా దేశం కోసం ఫైట్ చేసిన బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌(Begum Hazrat Mahal)ను  స్మరించుకుంటూ ఓ ట్వీట్ చేసింది. 

అలాగే హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌ నాటి గెటప్ ను అనుకరిస్తూ నివాళులు అర్పించింది.అనసూయ  ఫొటోస్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అవధ్‌ విముక్తి కోసం పోరాటం చేసిన మహా యోధురాలు బేగం హజ్రత్ మహల్. 

అనసూయ భరద్వాజ్ ..1857 కాలం నాటి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధురాలు ఆవాధీ క్వీన్ బేగం హ‌జ్‌ర‌త్ మ‌హ‌ల్‌ ను స్మరిస్తూ.. హజ్రత్ మహల్ భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.  బ్రిటీష్ పాలనను సవాలు చేయడానికి రెండు దశాబ్దాల పాటు తన జీవితాన్ని అంకితం చేసింది. దేశం కోసం పోరాడిన తీరుకు గుర్తుగా 1984 మే 10న ఆమె ఫొటోతో ప్ర‌భుత్వం ఓ స్టాంప్‌ను విడుదల చేసింది. తన పోరాట పటిమతో మనలో స్ఫూర్తిని నింపిన ఆమెను  స్మరించుకుందాం. అలాగే మ‌ర్చిపోయిన ఆమె పోరాట శక్తిని గుర్తుచేసుకుందాం. అంటూ వరుస ట్వీట్స్ చేశారు. 

ఎంతో మంది భారతీయులు 1857 క్విట్ ఇండియా మూమెంట్ లో పాల్గోని దేశం కోసం తమ ప్రాణాలను విడిచారు. అయితే ఈ మూమెంట్​లో పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా కీలక పాత్ర పోషించి తెగువ కనబరిచారు. వీరిలో ఒకరు హజ్రత్ మహల్. 

ఎప్పుడు గ్లామర్‌ ఫోటోస్ తో సోషల్ మీడియాలో కనిపించే అనసూయ..ఒక్కసారిగా బేగం హజ్రత్ మహల్ ను అనుకరిస్తూ ఫోటో షేర్ చేయడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అనసూయలో ఇంత మార్పేంటి? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తోన్నాయి.