మరో బోల్డ్ రోల్కు ఒకే చెప్పిన అనసూయ

మరో బోల్డ్ రోల్కు ఒకే చెప్పిన అనసూయ

బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ మరో బోల్డ్ రోల్ లో కనిపించేందుకు సిద్ధం అయ్యింది. రంగస్థలంకు మించి ఈ సినిమాలో అనసూయ పాత్ర ఉండనుందని సమాచారం. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం విమానం. ఈ సినిమాలో అనసూయ సుమతి అనే పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. సినిమాలో అను పాత్ర చాలా ప్రత్యేకం కానుందట.

అందుకే తాజాగా రిలీజ్ చేసిన విమానం ట్రైలర్ లో కూడా ఆమె పాత్రని పెద్దగా రివీల్ చేయలేదు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం మేరకు ఆమె పాత్ర ఈ సినిమాలో.. కాస్త వైల్డ్ అండ్ బోల్డ్ గా ఉండనుందట. ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రఖని ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో.. మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్రాజ్, మాస్టర్ ధ్రువన్, రాజేంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో రానున్న ఈ సినిమాని.. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్న అనసూయ ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.