యాంకర్ అనసూయ తండ్రి మృతి

యాంకర్ అనసూయ తండ్రి మృతి

బుల్లితెర యాంకర్, వెండితెర యాక్ట్రస్ అనసూయ భరద్వాజ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు (63) తార్నాకలోని తన నివాసంలో మృతిచెందారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సుదర్శన్ రావు చాలం కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆయన మృతితో అనసూయ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. విషయం తెలిసిన సినీ ప్రముఖులు అనసూయ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.