కరోనాపై యాంకర్ అనసూయ వీడియో మెస్సెజ్

కరోనాపై యాంకర్ అనసూయ వీడియో మెస్సెజ్

రోజురోజుకు కరోనా విస్తరిస్తుండటంతో ప్రజలు నానాకష్టాలు పడుతున్నారు. చాలామందిని కరోనా ఒక్కటే ఇబ్బందిపెడితే.. రైతులను మాత్రం అటు కరోనా.. ఇటు అకాల వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి. కరోనా దెబ్బకు పంట అమ్ముడుపోకపోవడంతో ఒక పక్క ఇబ్బంది పడుతుంటే.. పుండు పై కారం చల్లినట్లుగా మరో పక్క అకాల వర్షాలు రావడంతో ఉన్న కాస్త పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో రైతులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని బుల్లితెర బుల్లెమ్మ, యాంకర్ అనసూయ కోరారు.

ఒక పక్క యాంకరింగ్ చేస్తూనే.. మరోపక్క సినిమాలలో నటిస్తూ తన అందంతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న బొద్దుగుమ్మ.. రైతులే దేశానికి వెన్నెముక అని అన్నారు. లాక్ డౌన్ వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనందరికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె అన్నారు. లాక్ డౌన్ వల్ల పండ్ల రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారని.. అందుకే అందరం పండ్లు కొనుక్కొని తింటే వారిని ఆదుకున్నవాళ్లం అవుతామని ఆమె ప్రజలను, అభిమానులను కోరారు. రైతులను ఆదుకోవాలంటూ అనసూయ తన ఇన్ స్టాగ్రాం ఖాతాలో ఒక వీడియో పోస్టు చేశారు.

‘రైతు దేశానికి వెన్నెముక. రైతులేనిదే మనకు మనుగడ లేదు. ఈ కరోనా వైరస్ దాడి చేస్తున్న విపత్కర పరిస్థితుల్లో మనందరం రైతుకు అండగా నిలుద్దాం. మామిడి, అరటి, బత్తాయి, నిమ్మ, జామ వీటిని కొనుక్కొని తిందాం. రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం. ఆరోగ్యాన్ని పెంచుకుందాం. రైతును కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుకుందాం. రైతుకు మనం అవసరం. మనకు రైతు అవసరం. మనందరం దేశానికి అవసరం. మరచిపోకుండా ఇంట్లో ఉండండి. సురక్షితంగా ఉండండి. ఇంట్లో ఉంటూనే అందరిని కాపాడుకుందాం’ అని ఆ వీడియో ద్వారా కోరారు.

For More News..

పండ్ల బుట్టకు ఫుల్ డిమాండ్.. ఒక్కరోజే 2500 ఆర్డర్లు

లారీలు తిరగొచ్చు.. నిబంధనలు ఇవే..

లాక్‌డౌన్‌ కు ‘దయ్యాల’ గస్తీ