న్యూఢిల్లీ: ఈ-–కామర్స్ కంపెనీ మీషో లిమిటెడ్, ఐపీఓకి ముందు యాంకర్ బుక్‌లో వివాదాన్ని ఎదుర్కొంది. కంపెనీ సుమారు 25శాతం షేర్లను ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్‌కి కేటాయించడంతో, ఇతర పెద్ద ఇన్వెస్టర్లు నిరసనగా ఇష్యూ నుంచి వెనక్కి తగ్గారు. ఈ పెద్ద ఇన్వెస్టర్ల లిస్ట్‌లో క్యాపిటల్ గ్రూప్, అబెర్డీన్, నార్జెస్ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, నిప్పాన్ ఇండియా, నోమురా అసెట్ మేనేజ్‌మెంట్ ఉన్నాయి.
అయినా ఇతర యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఫుల్ డిమాండ్ కనిపించింది. కంపెనీ యాంకర్ లైనప్‌లో జీఐసీ, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఫిడిలిటీ, బ్లాక్‌రాక్, బైలీ గిఫోర్డ్, డబ్ల్యూసీఎం, డ్రాగనీర్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్లు కొనసాగుతున్నారు. మీషో ఐపీఓ ఈ నెల 3న మొదలై, 5న ముగుస్తుంది. రూ.5,420 కోట్ల ఐపీఓలో, షేర్ ధర పరిధిని రూ.105–రూ.111గా నిర్ణయించారు.
