ఆమె చేసిన తప్పు నేను చేయను.. నాకు ఆ క్లారిటీ ఉంది

ఆమె చేసిన తప్పు నేను చేయను.. నాకు ఆ క్లారిటీ ఉంది

బుల్లితెర స్టార్ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ బ్యూటీ. అంతకు ముందు కూడా తెలుగులో చాలా సినిమాల్లోనే నటించింది కానీ.. జబర్దస్త్ ఆమెకు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. నిజానికి రష్మీకి సినిమాలన్నా, నటన అన్నా చాలా ఇష్టం. జబర్దస్త్ లో ఎంత బిజీగా ఉన్నా..  అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే ఈ బ్యూటీ.. తాజాగా ఒక నిర్ణయం తీసుకుందట.

అదేంటంటే.. ఆమె అనసూయాలా టీవీ కెరీర్ ని ఆపేసి సినిమాల్లో చేయాలని అనుకోవడం లేదట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈమేరకు స్పందించింది.. " ఇందులో భాగంగా అనసూయ చేసిన తప్పు నేను చేయనని చెప్పుకొచ్చింది. నాకు సినిమాల్లో చేయడం ఇష్టమే కానీ దానికోసం టీవీ రంగాన్ని వదిలేయలేను అని క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే జబర్దస్త్ నుండి కానీ.. వేరే షోల నుండి కానీ బయటకు వెళ్లిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో నేను చూస్తున్నాను. అందుకే నేను అలాంటి పనిచేయను అను చెప్పుకొచ్చింది రష్మీ. ఇక ఈ వీడియో చూసిన చాలా మంది రష్మీ, అనసూయను దృష్టిలో పెట్టుకొనే ఆ వ్యాఖ్యలు చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అనసూయ సినిమాల చేయడం కోసం జబర్దస్త్ షో వదిలేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెకు సినిమాల్లో సరైన అవకాశాలు లేవు. అందుకే మల్లి జబర్దస్త్ లోకి రావడానికి ట్రై చేస్తున్నా.. మల్లెమాల టీమ్ దానికి ఒపుకోవడంలేదట. ఇది గమనించిన రష్మీ.. సినిమాల కోసం టీవీ రంగానికి దూరం కాకూడదు అని ఫిక్స్ అయిందట.