ఎవరి బతుకు వారిది..సనాతన ధర్మం వివాదంపై రష్మీ పోస్ట్ వైరల్

ఎవరి బతుకు వారిది..సనాతన ధర్మం వివాదంపై రష్మీ పోస్ట్ వైరల్

నటి, బుల్లితెర యాంకర్​ రష్మీ గౌతమ్(Rashmi Gautam)​ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇటీవల సనాతన ధర్మం(Sanatana Dharma)పై నెట్టింట చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్​ కల్యాణ్(Pawan Kalyan)​ సనాతన ధర్మం గొప్పతనాన్ని చెప్తున్న వీడియోను ఆమె ఎక్స్లో పోస్ట్​ చేసింది.

ఈ వీడియోపై కొందరు ఆమెపై కామెంట్లతో విరుచుకుపడ్డారు. దీనిపై రష్మీ మండిపడింది. ‘ఫ్రీడం ఆఫ్​ స్పీచ్​ ఉన్నంత మాత్రాన నా ఇష్టాఇష్టాల గురించి మీరెందుకు కామెంట్​ చేస్తున్నారు. దేవుడిని ఎందుకు నమ్మరని నేనెవరినీ అడగలేదు..అలాగే నాకు నచ్చిన ధర్మాన్ని నేను ఫాలో అవుతాను. ఇందులో మీ ప్రాబ్లం ఏంటి? అసలు ఏ మతం పర్ఫెక్ట్​గా ఉందో చెప్పగలరా?’ అంటూ ఫైర్​ అయ్యింది. ఎవరి బతుకు వారిని బతకనివ్వండంటూ ట్రోలర్స్​కు క్లాస్​ తీసుకుంది. రష్మీ పోస్ట్​ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. మూగ జీవాలను ఎంతో ప్రేమించే  రష్మీ..జంతు బలులను ఖండిస్తూ గతంలోనూ పోస్టులు పెట్టింది. 

రీసెంట్ గా సనాతన ధర్మం మీద కోలీవుడ్ హీరో, డీఎంకే మినిష్టర్ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ గా మారాయో తెలిసిందే. ఇక ఆ తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాల గురించి చాలా మంది పోస్ట్స్ పెడుతున్నారు. 

ఇక ఉదయ్ నిధి స్టాలిన్(Udhayanidhi Stalin) మొదటగా స్పందిస్తూ..సనాతన ధర్మం అనేది ఓ రోగం లాంటిది..ఓ దోమలాంటిది..డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటిదని, దాన్ని మనం నిర్మూలించాల్సిందేనంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా మంటలు పుట్టించాయి. సమాజం నుంచి తార స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా కూడా అతను మాత్రం తన మాటలకే కట్టుబడి ఉన్నట్టుగా ప్రకటించాడు. తాను కుల వివక్షను అంతమొందించాలనే అన్నానంటూ చెప్పుకొచ్చాడు. ఇక బీజేపీ హైకమాండ్ కూడా స్టాలిన్ కు వ్యతిరేఖంగా రియాక్ట్ అయినా విషయం తెలిసిందే.