
ప్రస్తుత కాలంలో ప్రజల జీవన విధానం మారిపోయింది. నిత్యం హడావుడి జీవితం గడపడం వారికి అలవాటైపోయింది. కాబట్టి, ప్రశాంతమైన, స్థిరమైన జీవితం ఎలా ఉంటుందో నేటి తరం చాలా మందికి తెలియదు. నగర ప్రజల జీవితం మరింత గజిబిబి గందరగోళం.. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు ఎంత మంచిదో అలాంటి వారు చాలా మందికి తెలియదు. వారంతా కాంక్రీట్ జంగీల్‌లో కంప్యూటర్లతో గడుపుతున్నారు. అయితే, ఇంగ్లాండ్ లో ఉండలేక ఓ మహిళ.. ఆమె ప్రేమికుడు ప్రకృతి ఒడిలోకి చేరుకున్నాడు. లక్షలు సంపాదించే కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి కారడవిలో కాపురం పెట్టేశారు . ఆ అడవిలోనే పర్యావరణహితంగా ఓ ఇంటిని నిర్మించుకున్నాడు. వాననీటిని వాడుకుంటూ,పంటలు పండించుకుంటూ హాయిగా బతుకున్నారు. వీరి జీవనశైలి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
న్యూ ఇంగ్లాండుకు చెందిన ఎల్లీ మేరీ బ్రౌన్ ఆమెకు ఉంటే విలాసవంతమైన ఇల్లు, లగ్జరీ లైఫ్ వద్దనుకొని అడవికి వెళ్లి జీవించాలని షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆమె తన ప్రియుడిని కూడా అడవికి తీసుకెళ్లి రెండున్నరేళ్లుగా అడవిలో జీవిస్తున్నారు. అంతకు ముందు మేరీ ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేసేది. ఆమె విధులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉండేవి. ఏమైందో ఏమో తెలియదు కాని అడవికి వెళ్లి జీవించాలని నిర్ణయించుకుంది, ఈ విషయాన్ని తన ప్రియుడు కైల్ తో చెప్పి ఒప్పించింది. ఆ తరువాత ఇద్దరూ అడవికి వెళ్లి జీవించడం మొదలు పెట్టారు. అడవిలో రెండేళ్లు కష్టపడి అక్కడున్న చెట్లను నరికి చెక్క ఇంటిని నిర్మించుకున్నారు. వారు కొత్త జీవితానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అడవిలో ఉంటూ బెడ్ ఫ్రేమ్, కిచెన్ క్యాబినెట్ మరియు ఇంటి పైకప్పును కూడా స్వయంగా తయారు చేశాడు. వంట కోసం గ్యాస్ పొయ్యి ఉన్నా.. కట్టెలపైనే వండుకొనేవారు. వారు నివసించే స్థలానికి దగ్గరలో ఉన్న నది నుంచి నీరు తెచ్చుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గడ్డ కట్టిన నీటిలో స్నానం చేసేవారు. ఆహారం కోసం వారు అడవిలో లభ్యమయ్యే వాటిని వండుకొని తింటున్నామని తెలిపారు. మేరీ ... ఆమె ప్రియుడితో కలిసి అక్కడ వ్యవసాయం చేస్తూ.. అక్కడ దొరికే సహజ పదార్థాలతో తయారు చేసిన సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తానని తెలిపింది. కైల్ వృత్తి పరంగా ఫోటోగ్రాఫర్ , వీడియోగ్రాఫర్ . అతను చాలా ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అక్కడే ఇల్లు కట్టుకుని, వాననీటిని వాడుకుంటూ పంటలు పండించుకుంటూ బతుకున్నారు. ఇప్పుడు తన పాత జీవితానికి సంబంధించిన ఏదీ గుర్తుకు రావడం లేదని అంటున్నారు. జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇతడి జీవనశైలి ఫొటోలను జనం తెగ చూస్తున్నారు.