ఏదైనా తప్పు జరిగితే క్షమించండి.. రష్మీ షాకింగ్ పోస్ట్

ఏదైనా తప్పు జరిగితే క్షమించండి.. రష్మీ షాకింగ్ పోస్ట్

బుల్లితెర యాంకర్ రష్మీ(Rashmi Gautham) ఆడియన్స్ ను క్షమాపణ కోరింది. తెలిసి తేలియాక తనవల్ల ఏదైనా తప్పుజరిగుంటే క్షమించండి అంటూ పోస్ట్ పెట్టింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama company) కార్యక్రమానిలోకి యాంకర్ గా రష్మీ వచ్చి ఏడాది పూర్తయింది. దీంతో ఆమెకు ఫ్యాన్స్ రకరకాల వీడియోస్ చేస్తూ సోషల్ మీడియా వేధికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఫ్యాన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ కు ఎమోషనల్ అయినా రష్మీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ సందర్బంగా సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.. "ప్రతీ సండే నాకు ఎంతో స్పెషల్ గా అవుతోంది. ప్రేక్షకులు మా శ్రీదేవి డ్రామా కంపెనీ షోను చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ కార్యక్రమం అందరికీ నచ్చడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.ఇక మాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే.. మమ్మల్ని క్షమించండి" అంటూ పోస్ట్ పెట్టింది. 

ప్రస్తుతం రష్మీ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇక ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) యాకర్ గా చేసిన సంగతి తెలిసిందే. సుధీర్ తప్పుకున్నాకా ఆ స్థానంలోకి రష్మీ వచ్చింది.