
బిగ్ బాస్ సీజన్ 7(Biggb boss season7) విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) నిలిచిన విషయం తెలిసిందే. ఒక సాధారణ వ్యక్తిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ టైటిల్ గెలుచుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు పల్లవి ప్రశాంత్. దీంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇలాంటి చాలా మందికి స్ఫూర్తిగా పల్లవి ప్రశాంత్ నిలిచాడని ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే.. ఓ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మాత్రం పల్లవి ప్రశాంత్ పై, అతని బిహేవియర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ మాజీ కంటెస్టెంట్ మరెవరో కాదు యాంకర్ శివ. మన మీడియా యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫేమ్ సమాడించిన యాంకర్ శివ.. బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్ లో కంటెస్టెంట్ గా వెళ్లారు. ఇక తాజాగా శివ పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం తన ఊరికి వెళ్లగా.. తనతో ప్రవర్థించిన తీరు అస్సలు బాలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన ఇన్స్టాగ్రామ వేదికగా పెట్టిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ ఆ పోస్టులో శివ ఎం పోస్ట్ చేశారంటే.. ఇంటర్వ్యూ కోసం పల్లవి ప్రశాంత్ 18 గంటలు వెయిట్ చేయించి.. ఇంటికి రా అన్నా ఇస్తా అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఇంటి బయట దాదాపు 8 గంటలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇవ్వను వెళ్ళిపోమని దురుసుగా ప్రవర్తించాడు. గొప్ప విన్నర్ ప్రశాంత్(వెటకారంగా). కనీసం అక్కడున్న తన ఫ్రెండ్ ను కూడా లెక్క చేయడం లేదు. దీనిపై ఒక వీడియో చేస్తా.. అది నాకు ఇంటర్వ్యూ ఇవ్వనందుకు కాదు.. ఇవ్వనని చెప్పిన విధానం బాలేదు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు శివ.