జయమ్మ రెడీ

జయమ్మ రెడీ

యాంకర్‌‌‌‌‌‌‌‌గా ఎంతో క్రేజ్‌‌‌‌ని సొంతం చేసుకున్న సుమ ఇప్పుడు సినిమాల్లోనూ సత్తా చాటాలనుకుంటోంది. ‘జయమ్మ పంచాయితీ’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. విజయ్ కుమార్ కలివారపు దర్శకత్వంలో బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తున్నట్టు నిన్న అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఒక హ్యూమరస్‌‌‌‌ వీడియోని కూడా షేర్ చేశారు. ‘అందరూ వాళ్ల సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు.. మనం కూడా లేట్ చేయకుండా అనౌన్స్ చేసేద్దాం’ అంటూ  ఆర్ఆర్ఆర్, కేజీయఫ్2, ఆచార్య, సర్కారు వారి పాట రిలీజ్ డేట్స్ చెప్పింది సుమ. కానీ ఆ సినిమాలతో సంబంధం లేకుండా తన పంచాయితీని ఏప్రిల్ 22న పెట్టేస్తానంటూ ఫన్నీగా అనౌన్స్ చేయడం నవ్వించింది. శ్రీకాకుళం బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో వస్తున్న ఈ మూవీలో సుమ  పల్లెటూరి మహిళగా కనిపించనుంది.