
టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ తన గొప్ప మనసును చాటుకున్నారు. సామాజిక సేవలో ముందుంటూ ప్రతీ ఏటా క్రిస్మస్ పండగ సందర్భంగా బహుమతులు అందజేస్తూ వస్తున్నారు. తాజాగా రూ. 5 లక్షల విరాళం అందించి తన ఉదారతను చాటుకున్నారు. యాంకర్ సుమ కొంతకాలంగా ఫెస్టివల్ ఫర్ జాయ్ అనే స్వచ్చంద సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొరోనా సమయంలో కూడా ఈ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు సుమ.
ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా తన వంతుగా రూ.5 లక్షల విరాళం అందించారు సుమ. ఈమేరకు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కు రూ.5 లక్షల చెక్ అందజేశారు. దీంతో సుమ అంభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
A heartfelt thank you to @follownatsworld for their generous 5 Lakh donation to the @FilmJournalists through @ItsSumaKanakala @FestivalsforJoy
— Telugu Film Journalists Association (@FilmJournalists) December 25, 2023
Special appreciation to #SreedharAppasani Garu, #ArunaGanti, #BapuNuthi , #PrashanthPinnamaneni & #RajAllada garu, #NATS Board of… pic.twitter.com/FJo1Bzzx57
ఇదిలా ఉంటే.. సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా చేస్తున్న మూవీ బాబుల్ గమ్. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రవికాంత్ పేరెపు తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాతో సుమ కొడుకు రోషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.