
సుమ కనకాల..17 ఏళ్లుగా స్టార్ యాంకర్గా కొనసాగుతున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా, టాక్ షో అయినా, స్పెషల్ ప్రోగ్రాం అయినా సుమ ఉండాల్సిందే. ఆమె పంచులు కామెడీ టైమింగ్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతటి క్రేజ్ సంపాదించుకున్న సుమ..తాజాగా ఒక స్పెషల్ వీడియో చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండింగ్లో ఉన్న కుమారీ ఆంటీ సాంగ్కు సుమ స్పెషల్ వీడియో చేసింది.
ఈ వీడియో చేసిన యాంకర్ సుమ(Anchor Suma) ఒక్కసారిగా..కుమారి ఆంటీ(Kumari Aunty)గా మారిపోయింది. మీది రూ.1000 అయింది..రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ కుమారీ ఆంటీ డైలాగ్స్తో ఈ వీడియో షేర్ చేసింది.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎవరు పాపులర్ అయిన..వారిని అనుకరిస్తూ ట్రెండింగ్ లోకి రావడం..వారిని మరింత లేపడం మన వాళ్లకు అలవాటే. ఇక రీసెంట్గా స్టార్ మా లో ప్రసారం అయిన బిగ్బాస్ ఉత్సవంలో కుమారి ఆంటీని స్పెషల్గా గెస్ట్గా పిలిచారు. ఈ షోలో కుమారి ఆంటీ నాన్ వెజ్ వంటలతో రుచి చూపించినట్లు సమాచారం.
ప్రస్తుతం కుమారి ఆంటీ పేరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈమెదే హవానడుస్తోంది.హైదరాబాద్ ఫేమస్ ప్లేస్లో ఫుడ్ స్టాల్ నడుపుకునే ఈ ఆంటీ ఒకే ఒక్క డైలాగ్తో ఫేమస్ అయిపోయారు. వచ్చిన కస్టమర్స్ ను నాన్నా, బుజ్జి, కన్నా అంటూ ప్రేమగా పలకరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు సుమ కూడా ఆమెను అనుకరించి వీడియో షేర్ చేయడంతో మరింత పాపులారిటీ కూడా సొంతం చేసుకుంటుంది.