Anchor Suma: తప్పు చేశాను.. ప్రాయశ్చితం చేసుకుంటున్నాను.. యాంకర్ సుమ షాకింగ్ కామెంట్స్

Anchor Suma: తప్పు చేశాను.. ప్రాయశ్చితం చేసుకుంటున్నాను.. యాంకర్ సుమ షాకింగ్ కామెంట్స్

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ(Anchor Suma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన చలాకీ మాటలతో ఆడియన్స్ ను అలరించడంలో ఆమెనే టాప్. ఇన్నేళ్ళలో ఎన్నో మారుతున్నాయి కానీ, యాంకర్ గా సుమ మాత్రం అస్సలు మారడంలేదు. ఇక ఆమె సెటైర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సమయానుసారం ఆమె చేసి కామెడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే వివాదాలకు కూడా చాలా దూరంగా ఉంటారు సుమ. 

అయితే తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో తానేదో తప్పు చేశానని, దానికి ప్రాయశ్చితం చేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు సుమ. దాంతో.. ఆ వీడియో చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఉగాది పండగ రోజున డైట్ పక్కకు నెట్టేసి.. తనకు నచ్చిన వంటకాలన్నీ ఫుల్లుగా లాగించేసిందట సుమ. అదే తాను చేసిన తప్పు అని..  దానికి ప్రాయశ్చితంగా వర్క్ అవుట్ చేస్తున్నా అంటూ ఓ వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అది విన్న నెటిజన్స్ నోరెళ్లబెట్టేశారు. సుమ సెన్సాఫ్ హ్యూమర్ గురించి తెలిసిందేగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సుమ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.