
- ఆది మానవుల కాలానికి చెందినవిగా గుర్తింపు
- కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో వెలుగులోకి..
చిన్నచింత కుంట, వెలుగు: మహజీనుగరాల గుట్టపై పురాతన సమాధులుబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగరాల పెద్దగుట్టపైన ఆదిమానవుల కాలం నాటి డోల్ మెన్ సమాధులు బయటపడ్డాయి. వీటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. సమాధుల రాళ్లపై చిత్రాలు ఎరుపురంగులో ఉన్నాయని, ఇవి మధ్యయుగాలకు చెందినవై ఉండొచ్చని తెలిపారు.
బొమ్మ లోపల బొమ్మలవలె ఒక మనిషి నిలువుబొమ్మలో గీసినట్టుగా ఉన్నాయని బృందం సభ్యుడు కావలి చంద్రకాంత్, చరిత్ర నిపుణులు బండి మురళీధర్ రెడ్డి, శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో పరిశోధిస్తే మరిన్ని చరిత్ర పూర్వయుగ ఆనవాళ్లు తెలిసే అవకాశముందని చెప్పారు. ముస్తాపేట మండలం నందిపేట, చిన్న చింతకుంట మండలం అమపూర్ సమీపంలోని గుట్టల్లో కూడా ఆదిమానవులకు సంబంధించిన డోల్ మెన్ సమాధులు, రాతి చిత్రాలు కనిపించాయని వెల్లడించారు.