విజయ్ 66.. ఆసక్తికర ఫొటో

విజయ్ 66.. ఆసక్తికర ఫొటో

ఇళయ దళపతి విజయ్ - టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘విజయ్ 666’ మూవీ కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. కీలక షెడ్యూల్ ఎంతో సంతోషంగా సాగిందని, త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ ట్వీట్ లో వెల్లడించింది. హీరో విజయ్ కు దర్శకుడు వంశీ ఓ ఇంట్రెస్టింగ్ గా ఏదో వివరిస్తున్న ఫొటోను షేర్ చేసింది. విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో సినిమా షూటింగ్ జరిగింది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను విజయ్, వంశీలు మర్యాదపూర్వకంగా కలుసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శరత్ కుమార్, ప్రభుతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా వస్తున్న ఈ మూవీ తమిళ్,తెలుగు భాషల్లో రానుంది. కాగా ఈ మూవీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. 

మరిన్ని వార్తల కోసం : -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ


F3 మూవీ గురించి వరుణ్ చెప్పిన విశేషాలు