ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన

ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్...ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల మేరకు నిధుల విడుదల, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఉన్న పెండింగ్ అంశాలను ప్రధాన మంత్రి మోడీ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది.

సీఎం జగన్ తో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ లను కూడా సీఎం జగన్ కలువనున్నారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తో భేటీ కానున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలపై చర్చించే అవకాశం ఉంది.