ఉద్యోగ బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఉద్యోగ బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఉద్యోగ బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  మే 22 నుంచి 31 వరకు బదిలీలు చేయనుంది. ఈ మేరకు గైడ్ లైన్స్  విడుదల చేసింది. రెండు కేటగిరీలుగా ఉద్యోగుల బదిలీ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

 2023 ఏప్రిల్ 30 నాటికి  రెండేళ్లు ఒకేచోట పనిచేసేవారికి రిక్వెస్ట్ పై  బదిలీలకు అవకాశం కలిపించింది. ఇక 2023 ఏప్రిల్ 30 నాటికి ఐదేళ్లు పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి చేసింది.  

అంతేకాదు ఉద్యోగుల బదిలీ నిషేధంపై ప్రభుత్వం సడలింపు ఇచ్చింది.  టీచర్లతో పాటుగా ఇతర ఉద్యోగులకు విడిగా గైడ్ లైన్స్  విడుదల చేసింది.