యాదగిరీశుడి సేవలో ఏపీ హైకోర్టు జడ్జి సుజాత

యాదగిరీశుడి సేవలో ఏపీ హైకోర్టు జడ్జి సుజాత

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ వి. సుజాత శనివారం దర్శించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు.  మొదట స్వామివారి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వచ్చిన ఆమెకు భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి మొక్కను బహూకరించి స్వాగతం పలికారు. 

అనంతరం ఆలయంలోకి వెళ్లిన ఆమెకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట తహశీల్దార్ గణేష్ నాయక్, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.