న్యూఢిల్లీ: ఏపీ నగరం విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేవలం రెండు రోజుల్లోనే రెన్యూవబుల్ సెక్టార్‌లో రాష్ట్రానికి రూ. 5.2 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు లభించాయని ఆ రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి రవికుమార్ ప్రకటించారు.
ఈ పెట్టుబడుల ద్వారా 2.6 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ నెల 13న రూ. 2.94 లక్షల కోట్ల ఒప్పందాలు, నవంబర్ 14న రూ. 2.2 లక్షల కోట్ల ఒప్పందాలు ఖరారయ్యాయి. ఈ పెట్టుబడులు పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజీ, బయోఫ్యూయెల్స్ ప్రాజెక్టులకు సంబంధించినవి.
