Andhra train accident: ఏపీ రైలు ప్రమాదం: 33 రైళ్లు రద్దు...22 రైళ్లు దారి మళ్లింపు

Andhra train accident: ఏపీ రైలు ప్రమాదం:  33 రైళ్లు రద్దు...22 రైళ్లు దారి మళ్లింపు

ఏపీలోని విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య  14 కు చేరింది.  దీంతో  ఇప్పటి వరకు 33 రైళ్లను రద్దు చేయగా, మరో ఆరు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు అక్టోబర్ 30న  తెలిపారు. 

వాల్టేర్‌లోని కంటకపల్లె , అలమనాడ స్టేషన్‌ల మధ్య రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో మొత్తం 33 రైళ్లను రద్దు చేశామని. 24 రైళ్లను దారి మళ్లించామని..11 పాక్షికంగా రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే, భువనేశ్వర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి బిశ్వజిత్ సాహు తెలిపారు . ఇందులో మూడు రైళ్లను రద్దు చేశామని..రెండు రైళ్లను ఈ ఉదయం రీషెడ్యూల్ చేశామని తెలిపారు.

రద్దైన రైళ్లు ఇవే..

  • రైలు నెంబర్ 17243 గుంటూరు టూ రాయ్ గడ్ 
  • రైలు నెంబర్ 17239 గుంటూరు టూ విశాఖపట్నం 
  • రైలు నెంబర్ 17267 కాకినాడ పోర్ట్ టూ విశాఖపట్నం 
  • రైలు నెంబర్ 17268 విశాఖపట్నం కాకినాడ పోర్ట్
  • రైలు నెంబర్ 07466 రాజమండ్రి టూ విశాఖ పట్నం 
  • రైలు నెంబర్ 07467 విశాఖపట్నం టూ రాజమండ్రి
  • రైలు నెంబర్ 12718 విజయవాడ టూ విశాఖ పట్నం
  • రైలు నెంబర్ 12717 విశాఖ పట్నం టూ విజయవాడ

దారి మళ్లించిన రైళ్లు ఇవే..

  • బరౌనీ కోయంబత్తూరు మధ్య నడిచే రైలును తిత్లిఘర్, రాంచీ, నాగ్ పూర్, బల్లార్షా, విజయవాడ మీదుగా మళ్లింపు
  • టాటానగర్ ఎర్నాకుళం రైలును గొట్లం, తిత్లినగర్, నాగ్ పూర్, బల్లార్షా, విజయవాడ మీదుగా మళ్లింపు
  • భువనేశ్వర్ ముంబై రైలును విజయనగరం, తిత్లినగర్, రాంచీ, నాగ్ పూర్, కాజీపేట మీదుగా మళ్లింపు
  • హౌరా సికింద్రాబాద్ రైలును విజయనగరం తిత్లిఘర్ రాంచీ, నాగ్ పూర్ , కాజీపేట మీదుగా మళ్లింపు
  • హౌరా బెంగుళూరు రైలును విజయనగరం, తిత్లిఘర్, రాంచీ, నాగ్ పూర్, బల్లార్షా, విజయవాడ మీదుగా మళ్లింపు
  • సంబల్ పూర్ నాందేడ్ రైలును విజయనగరం వరకు మాత్రమే నడుపుతారు
  • పూరి తిరుపతి మధ్య నడిచే రైలును బాలుగావ్ వరకు నడుపుతారు. 
  • ముంబై భువనేశ్వర్ మధ్య నడిచే రైలులు విశాఖ పట్నం వరకే నడుపుతారు 
  • భువనేశ్వర్ ముంబై మధ్య నడిచే రైలును రద్దు చేశారు