ఏపీ టు హర్యానా గంజాయి ట్రాన్స్ పోర్ట్ ..కారుతో పాటు 24 కేజీల గంజాయి స్వాధీనం

ఏపీ టు హర్యానా గంజాయి ట్రాన్స్ పోర్ట్ ..కారుతో పాటు 24 కేజీల గంజాయి స్వాధీనం
  • నిందితుడు అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు

బూర్గంపహాడ్, వెలుగు: ఏపీలోని చింతూరు నుంచి హర్యానాకు తరలిస్తున్న గంజాయిని  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ పోలీసులు పట్టుకున్నారు. పాల్వంచ సీఐ సతీశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బూర్గంపహాడ్​ మండలం మొరంపల్లి బంజర శివారులో సోమవారం ఎస్ఐ ప్రసాద్ సిబ్బంది తో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. భద్రాచలం నుంచి పాల్వంచ వైపు అనుమానాస్పదంగా వెళ్లే..  కారును ( హెచ్ఆర్ 33బి 6330) ఆపారు. తనిఖీలు చేయగా 24 కేజీల గంజాయిని గుర్తించారు.  దీనివిలువ సుమారు రూ. కోటి ఉంటుంది. హర్యానాకు చెందిన సంజీవ్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు.  కారు ఓనర్  ప్రిన్స్ కుమార్ ఆదేశాలతో చింతూరులో ఇద్దరి వద్ద గంజాయిని తీసుకుని వెళ్తున్నట్టు నిందితుడు అంగీకరించినట్టు సీఐ సతీశ్​తెలిపారు.  కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపామని చెప్పారు.  మరో  ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. ఏఎస్ఐ నాగభిక్షం, సిబ్బంది ఉన్నారు.