
జబర్దస్త్(Jabardasth) కమెడియన్ పంచ్ ప్రసాద్(Punch Prasad) కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నా ఆరోగ్యంలో మాత్రం మెరుగుపడలేదు. దీంతో మరోసారి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు ప్రసాద్.
అయితే ప్రస్తుతం ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని కమెడియన్ నూకరాజు(Nukaraju) సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. వీలైనంత త్వరగా అతడికి ఆపరేషన్ చేయాలని, అందుకు చాలా డబ్బు అవసరమని, దాతలు ఎవరైనా ఉంటె పెద్దమనసు చేసుకొని సాయం చేయాలని కోరుతూ వీడియో రిలీజ్ చేశాడు.
ఇక తాజాగా ఈ వీడియోను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కార్యక్రమాలను పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణ(Harikrishna)కు ఒక నెటిజన్ ట్యాగ్ చేశారడు. దీంతో ఈ విషయంపై డాక్టర్ హరికృష్ణ స్పందించారు. ఇప్పటికే తాము ప్రసాద్ కుటుంబసభ్యులతో కాంటాక్ట్ లో ఉన్నామని, వారితో లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లై చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపాడు. డాక్యుమెంట్లను పరిశీలించి వీలైనంత త్వరగా ప్రసాద్ కు వైద్యం అందేలా చేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో పంచ్ ప్రసాద్‌కి త్వరలోనే సర్జరీ జరిగి ఆరోగ్యంగా బయటకు రావాలంటూ నెటిజన్లు కామెంట్స్ పడుతున్నారు.