CSK vs KKR: స్టేడియంలో ధోనీ జపం.. తట్టుకోలేక చెవులు మూసుకున్న రస్సెల్

CSK vs KKR: స్టేడియంలో ధోనీ జపం.. తట్టుకోలేక చెవులు మూసుకున్న రస్సెల్

ప్రపంచవ్యాప్తంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చెన్నైలోనైతే మహేంద్రుడి ఫాలోయింగ్ తట్టుకోవడం కష్టమే. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ధోనీకి ఈ నగరంలో ఫ్యాన్స్ మాత్రమే కాదు భక్తులు కూడా ఉన్నారు. చెన్నైలో మ్యాచ్ జరిగితే ధోనీ నామస్మరణతో స్టేడియం మొత్తం ఊగిపోతోంది. నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్ లోనూ ఇదే సీన్ రిపీటైంది. అయితే ఈ క్రేజ్ ను ప్రత్యక్షంగా చూసిన కేకేఆర్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ బిత్తరపోయాడు.

స్వల్ప లక్ష్య ఛేదనలో చెన్నై విజయం దిశాగా దూసుకెళ్తుంది. 138 పరుగుల లక్ష్య ఛేదనలో మరో మూడు పరుగులు చేయాల్సిన దశలో శివమ్ దూబే ఔటయ్యాడు. దీంతో జడేజా బదులు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చేయడానికి క్రీజ్ లోకి వచ్చాడు. ధోని బ్యాటింగ్‌కు బయలుదేరిన వెంటనే..  చెన్నై ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ధోనీ పేరును జపిస్తూ స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. చప్పట్లు కొడుతూ బిగ్గరగా కేకలు వేశారు. ఈ అరుపులు బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ తట్టుకోలేకపోయాడు. 

ప్రేక్షకుల గోల భరించలేక చెవులు మూసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చెన్నైలో ధోనీ క్రేజ్ ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. ఇది చూసిన మాహీ అభిమానుకు పండగ చేసుకుంటున్నారు. సోమవారం (ఏప్రిల్ 8) జరిగిన ఈ మ్యాచ్‌‌లో సీఎస్కే 7  వికెట్ల తేడాతో నైట్ రైడర్స్‌‌ను ఓడించింది.టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన కోల్‌‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 137/9 స్కోరు మాత్రమే చేసింది. ఛేజింగ్‌‌లో చెన్నై 17.4 ఓవర్లలోనే 141/3 స్కోరు చేసి గెలిచింది. రుతురాజ్‌‌తో పాటు శివం దూబే (18 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌‌‌, 3 సిక్సర్లతో 28) రాణించాడు.  జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.