ఆటపాటలతో చిన్నారుల్లో శారీరక అభివృద్ధి

ఆటపాటలతో చిన్నారుల్లో శారీరక అభివృద్ధి

సూర్యాపేట, వెలుగు : అంగన్​వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్యతో చిన్నారుల్లో శారీరక, మానసిక అభివృద్ధి పెరుగుతుందని డీడబ్ల్యూవో నర్సింహరావు అన్నారు. ‘అమ్మ మాట.. -అంగన్ వాడీ బాట’ కార్యక్రమంలో భాగంగా బుధవారం మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రిలో  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్​వాడీ కేంద్రాల్లో ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్​ అందించాలన్నారు. 

అంగన్​వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు యూనిఫామ్స్, స్కూల్ బుక్స్ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతకుముందుగా విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సీడీపీవో సుబ్బలక్ష్మి, సూపర్​వైజర్ వీరమ్మ, ఏఎన్ఎమ్ పద్మజ, అంగన్ వాడీ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.