నల్ల చీరలు ధరించి.. అంగన్వాడీల వినూత్న నిరసన

నల్ల చీరలు ధరించి.. అంగన్వాడీల వినూత్న నిరసన

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ వినూత్న నిరసనలు చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. కనీస వేతనాలు అమలు చేయాలని, బడ్జెట్​లో తమకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలిని, గ్యాట్యుటీ అమలుతో పాటు తదితర సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలంటూ జిల్లా కేంద్రంలో అంగన్​వాడీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. నల్లరంగు చీరలు ధరించి కలెక్టరేట్​ముందు బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ALSO READ :సీఎం కాళ్లు కడిగింది.. మూత్రం బాధితుడివి కాదు!

తమ డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసనలు విరమించేది లేదని స్పష్టం చేశారు. వారికి మద్దతుగా సీఐటీయూ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అవట్లేదని నేతలు అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్​ చేశారు. లేదా పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 

మేడ్చల్​లో నిరసనలు..

మేడ్చల్​లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ కలెక్టరేట్​ ముందు అంగన్వాడీ కార్మికులు నిరసనలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం.. గ్రాట్యుటీ, వేతనం పెంపు తదితర సౌకర్యాలు కల్పించాలని కార్మికులు డిమాండ్​ చేశారు. వీరికి సీఐటీయూ నేతలు మద్దతు తెలిపారు.