అనిల్ అంబానీకి మరో శుభవార్త.. ప్రభుత్వ కంపెనీ నుంచి ఆర్డర్.. దూసుకెళ్తున్న స్టాక్!

అనిల్ అంబానీకి మరో శుభవార్త.. ప్రభుత్వ కంపెనీ నుంచి ఆర్డర్.. దూసుకెళ్తున్న స్టాక్!

Anil Ambani: వ్యాపారవేత్త అనిల్ అంబానీ దాదాపు 17 ఏళ్ల తర్వాత మంచి సమయాన్ని చూస్తున్నారు. 2008 తర్వాత ఆయన సంస్థలు భారీ అప్పుల ఊబిలో కూరుకుపోవటంతో పతనాన్ని చూసిన ఆయన మళ్లీ పుంజుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై ఈడీ దాడులు, దర్యాప్తు వంటి వార్తలు ఉన్నప్పటికీ ఆయన సంస్థలు మాత్రం తమపని తాము చేసుకుపోవటంపై ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ సంస్థలు మార్కెట్ల పతనంలో కూడా మ్యాజిక్ చేస్తున్నాయి. 

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ ఫ్రా సంస్థలకు శుభవార్త వచ్చింది. ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ అయిన ఎన్‍హెచ్‌పీసీ నుంచి ఆర్డర్ కి సంబంధించిన లెటర్ ఆఫ్ అవార్డును పొందాయి సంస్థలు. ఈ వార్తతో నేడు ఇంట్రాడేలో స్టాక్స్ కొనుగోలుకు రిటైల్ ఇన్వెస్టర్లు ఆసచూపించటంతో లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. 

రిలయన్స్ ఇన్ ఫ్రా సంస్థ 390 మెగావాట్ల సోలార్ ఎనర్డీ అండ్ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టును ప్రభుత్వ సంస్థ నుంచి గెలుచుకుంది. దీంతో మెుత్తం ఆర్డర్ పోర్ట్ ఫోలియో పెరిగింది. ఇది కొత్త ఆదాయాలను కంపెనీకి తెచ్చిపెట్టనుంది. అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ పవర్ ఇప్పటికే దాదాపు 2.5 GWp సోలార్ ఎనర్జీ.. 2.5 GWhr బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

గ్రీన్ ఎనర్జీ రంగంలో పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా రిలయన్స్ కొత్త వ్యాపార అవకాశాలను చేజిక్కించుకుంటోంది. 50 శాతం భాగస్వామ్యంతో రిలయన్స్ పవర్ భూటాన్ ప్రభుత్వంతో కలిసి ఒక జాయింట్ వెంటర్ నిర్వహిస్తోంది. ఇందుకోసం భూటాన్‌లో GDL-రిలయన్స్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసింది.