బీజేపీ ఎన్నికల స్టంట్ లో భాగమే కవిత అరెస్ట్ : అనిల్ కుమార్ యాదవ్

బీజేపీ ఎన్నికల స్టంట్ లో భాగమే కవిత అరెస్ట్ :   అనిల్ కుమార్ యాదవ్

శంషాబాద్, వెలుగు:  దేశ సంస్కృతిలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ  ఒకరికి ఒకరు మద్దతు తెలుపుకుంటూ.. కులమతాలకు అతీతంగా కలసి మెలిసి జీవిస్తారని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.  పార్లమెంట్  ఎన్నికల స్టంట్ లో భాగమే కవిత అరెస్ట్ అని , అందుకే  కేంద్రంలోని బీజేపీ ఎన్నికలకు ముందే ఆమె అరెస్టు చేయించిందని ఆయన ఆరోపించారు. శంషాబాద్ మండలం నర్కుడలో ఆదివారం శంషాబాద్  కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ బర్త్ డే సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పాల్గొన్నారు. వారిని శేఖర్ యాదవ్ శాలువాలతో సన్మానించి బొకేలు అందజేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో  ఎంపీ అనిల్ కుమార్ యాదవ్  మైనార్టీ సోదరులకు ఖర్జూర పండ్లు తినిపించి రంజాన్ ఉపవాస దీక్ష విరమింప చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలనకు ఆకర్షితులై  చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీలో చేరడం శుభపరిణామమని, వచ్చే ఎన్నికల్లో 13 సీట్లు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జలపల్లి నరేందర్, ధనుంజయ్, సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.