స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి : అనిల్ యాదవ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి : అనిల్ యాదవ్
  • పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం 

కోల్​బెల్ట్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పీసీసీ ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ఇన్​చార్జ్, రాజ్యసభ సభ్యుడు అనిల్​ కుమార్ ​యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం మందమర్రిలోని ఎమ్మెల్యే క్యాంప్ ​ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్​కార్యకర్తల సమావేశానికి చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు.  జిల్లా, మండల, బ్లాక్, పట్టణ కాంగ్రెస్​ అధ్యక్షుల ఎంపికకు అందిన దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్​కార్యకర్తలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 

పార్టీ కోసం నిరంతరం శ్రమించిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందని తెలిపారు. దేశ చరిత్రలో 42శాతం బీసీ రిజర్వేషన్ ​ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామ, మండల, జిల్లా కమిటీల నియామకాలను ఈనెలలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గతంలో తాను యూత్​ కాంగ్రెస్​ స్టేట్ ​ప్రెసిడెంట్​గా ఎన్నికకు  దివంగత కాకా వెంకటస్వామి ఆశీర్వాదం,రాష్ట్ర మంత్రి వివేక్​ వెంకటస్వామి సపోర్ట్ కారణమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, పట్టణ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కాంగ్రెస్ తోనే రాష్ట్రాభివృద్ధి 

లక్సెట్టిపేట, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. లక్సెట్టిపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో పదేళ్లుగా జరగని అభివృద్ధి కేవలం ఏడాదిన్నరలో జరిగిందని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో గెలుపు కోసం పని చేయాలి

ఆసిఫాబాద్, వెలుగు: కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం పని చేయాలని అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్​హాల్​లో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశానికి టీపీసీసీ జనరల్ సెక్రెటరీ అచ్యుత రమేశ్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్,  జీసీసీ చైర్మన్ తిరుపతి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి హాజరయ్యారు. కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్కరికి జిల్లా కమిటీలో అవకాశం దక్కుతుందని హామీ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.