నేను - చిరంజీవి మంచి దోస్తులం.. యుగ‌యుగాల ప్ర‌తిష్ఠ‌ల‌ను దెబ్బ‌తీయొద్దు

నేను - చిరంజీవి మంచి దోస్తులం.. యుగ‌యుగాల ప్ర‌తిష్ఠ‌ల‌ను దెబ్బ‌తీయొద్దు

భోళా శంకర్(Bhola shankar) సినిమాపై వస్తున్న విమర్శలపై ఆ చిత్ర నిర్మాత అనిల్ సుంకర(Anil sunkara) స్పందించారు.  భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అవడంతో నిర్మాతకు, చిరంజీవికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, రెమ్యూనిరేషన్ విషయంలో కూడా చిరు ఒత్తిడి చేశాడని, అందుకోసం ఆయన తన ఫామ్ హౌస్ ను కూడా అమ్ముకోవాల్సి వచ్చిందనే వార్తలు వైరల్ అయ్యాయి.   

తాజాగా ఈ వార్తలపై నిర్మాత అనిల్ సుంకర స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారాలని ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని,  ఇది క్రూరమైనవాళ్లు చేసిన పని అని..అలాంటి చెత్త మాటలను నమ్మకండని తెలిపారు అనిల్ సుంకర. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ కొంతమంది క్రూరమైన వారికి వినోదం కావొచ్చు కానీ.. ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న ప్రతిష్టను దెబ్బతీయడమనేది ఆమోదయోగ్యం కాదు. అది ఆ కుటుంబాలకు విపరీతమైన ఒత్తిడిని, ఆందోళనను కలిగిస్తుంది. నాకు, చిరంజీవిగారికి మధ్య వివాదం ఏర్పడిందని వస్తున్న వార్తలు అన్ని చెత్త. ఆయన నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ గా నిలిచారు. మా మధ్య మొదటి నుండి మంచి సంబంధాలున్నాయి. దయచేసి అబద్దాలను క్రియేట్ చేయకండి. ఇలాంటి పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన ఇండస్ట్రీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో మరింత బలంగా మీ ముందుకు వస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఇక అనిల్ సుంకర చేసిన ఈ ట్వీట్ తో భోళా శంకర్ సినిమాపై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.

ఇక భోళా శంకర్ సినిమా విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు. తమిళ హిట్ మూవీ వేదాళం కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు రూ.110 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా.. మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో చిత్ర నిర్మాతలకు దాదాపు రూ.80 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.