పొలిమేర 2 మూవీ ట్రైలర్ లాంచ్

పొలిమేర 2 మూవీ ట్రైలర్ లాంచ్

సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. గెట‌‌‌‌ప్ శ్రీను, రాకేందు మౌళి,  బాలాదిత్య, ర‌‌‌‌వి వ‌‌‌‌ర్మ, చిత్రం శ్రీను ఇతర పాత్రలు పోషించారు. గౌరికృష్ణ నిర్మాత.  డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గీతా ఆర్ట్స్ సపోర్ట్‌‌‌‌తో నవంబర్ 3న విడుదల చేస్తున్నారు. శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు.

హీరో కార్తికేయ, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బన్నీ వాసు ముఖ్య అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.  సత్యం రాజేష్ మాట్లాడుతూ ‘పార్ట్ 1కు మించి ఇది ఉండబోతుంది. వంశీ నందిపాటి సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అన్నాడు. ఇందులో భాగమవ్వడం సంతోషంగా ఉందని చెప్పింది కామాక్షి.  సినిమాలో చాలా సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌లు ఉంటాయన్నాడు బాలాదిత్య.

గీతా ఆర్ట్స్ సపోర్ట్‌‌‌‌తో మా మూవీ విడుదలవ్వడం ఆనందంగా ఉందన్నాడు దర్శకుడు అనిల్. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నామన్నాడు నిర్మాత గౌరికృష్ణ. గెటప్ శీను, సాహితి, మ్యూజిక్ డైరెక్టర్  గ్యానీ  తదితరులు పాల్గొన్నారు.