Thandel: నాగ చైతన్య కోసం యానిమల్ ఫైట్ మాస్టర్..ఇక రాజులమ్మ జాతరే!

Thandel: నాగ చైతన్య కోసం యానిమల్ ఫైట్ మాస్టర్..ఇక రాజులమ్మ జాతరే!

నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. సాయి పల్లవి హీరోయిన్. చందూ మొండేటి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు. ‘తండేల్’ పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ. ఈ చిత్రంలో నటీనటుల గెటప్‌‌‌‌‌‌‌‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, యాసలతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌గా కనిపించేలా చందు జాగ్రత్తగా చేసుకుంటున్నారట. 

తాజా సమాచారం ప్రకారం..డైరెక్టర్ చందు మొండేటి..నాగచైతన్య కోసం మరో కీలకమైన డెసిషన్ తీసుకున్నారు. ఈ సినిమాలో చై తో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయట. అందుకోసం ఫేమస్ ఫైట్ మాస్టర్ ని రంగంలోకి దించారు. ఆయన కంపోజ్ చేసిన సినిమాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆయన ఎవరో కాదు సుప్రీం సుందర్. ఈ పేరు తెలుగు వాళ్ళుకు తెలియకపోవొచ్చు.కానీ, సుప్రీం సుందర్ చేసిన సినిమాలు బాగా తెలుసు. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కోషియం అదే తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో పాటు..సందీప్ రెడ్డి వంగా యానిమల్ కి ఫైట్ మాస్టర్ గా పనిచేశారు.

ఇప్పుడు తండేల్ కి సుప్రీం పర్యవేక్షణలోనే లేటెస్ట్ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశారని, అది నాగచైతన్యకు ఒక రేంజ్ లో వర్కౌట్ అయిందని..ఇక థియేటర్లో ఆడియన్స్ విజిల్స్ వేయడం పక్కా అని సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. 

బోటు నడిపే వ్యక్తి బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లగా..అలా సముద్రవేట లో ఉంటూ పాకిస్థాన్‌ కోస్టుగార్డుల చెరలో చిక్కుతాడు. అలా అక్కడి పాకిస్థాన్ జైలు నుంచి..తాను ప్రేమించిన వాడు ఎప్పుడొస్తాడో అని ఎదురు చూసే పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు..దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.