క్రేజీ సీక్వెల్‌‌‌‌లో యానిమల్ హీరోయిన్‌‌‌‌

క్రేజీ సీక్వెల్‌‌‌‌లో యానిమల్  హీరోయిన్‌‌‌‌

యానిమల్’ చిత్రంలో రణబీర్ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఎంతగా పేరొచ్చిందో.. అందులో సెకెండ్ హీరోయి న్‌‌‌‌గా నటించిన త్రిప్తి డిమ్రికి అంతే పాపులారిటీ వచ్చింది. తన క్యారెక్టర్ నిడివి తక్కువైనప్పటికీ తన అందంతో ఎంతగానో ఆకట్టుకుందామె. గతంలోనూ తను పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ సినిమాతో ఆమె  నేషనల్‌‌‌‌ క్రష్‌‌‌‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. 

రవితేజ సినిమాలోనూ ఆమె నటించ బోతోందనే వార్తలొచ్చాయి. టాలీవుడ్ ఎంట్రీ మాటెలా ఉన్నా బాలీవుడ్‌‌‌‌లో మాత్రం ఓ క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌లో ఆమె నటించబో తున్నట్టు తెలుస్తోంది. ‘ఆషికి’ ఫ్రాంచైజీకి బాలీవుడ్‌‌‌‌ లో ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పటికే వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పు డు థర్డ్ పార్ట్ తీయబోతున్నారు. కార్తీక్ ఆర్యన్‌‌‌‌ హీరోగా నటించబోయే ఈ చిత్రానికి అను రాగ్ బసు దర్శకత్వం వహించనున్నాడు. టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.