
భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును మరో ఇద్దరు కళాకారులు తిరస్కరించారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఇప్పటికే పద్మ అవార్డును తీసుకోనని ప్రకటించగా తాజాగా బెంగాల్ కు చెందిన ప్రముఖ సింగర్ సంధ్య ముఖోపాధ్యాయ్, తబలా మాస్ట్రో పండిట్ అనింధ్య ఛటర్జీలు పద్మశ్రీని తిరస్కరించారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు తన స్థాయికి తగదని సంధ్య స్పష్టం చేశారు. జూనియర్ ఆర్టిస్టులకు పద్మశ్రీ అవసరమని, అలాంటి అవార్టుకు ఎంపిక చేయడం తనను అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. సంధ్యను మమతా బెనర్జీ ప్రభుత్వం 2011లో బెంగాల్ అత్యున్నత పౌర పురస్కారమైన బంగా బిభూషణ్ తో సత్కరించింది. 1970ల్లో ఆమె బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ నేషనల్ అవార్డు అందుకున్నారు.
ఇక పండిత్ అనింద్య ఛటర్జీ సైతం పద్మశ్రీ అవార్డును తిరస్కరించినట్లు చెప్పారు. పద్మశ్రీ తీసుకునే స్థాయిని తానెప్పుడో దాటిపోయానని అన్నారు. అనింద్య పండిట్ రవి శంకర్, ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ తదితరులతో కలిసి పనిచేశారు. 2002లో ఆయనను సంగీత్ నాటక అకాడమీ పురస్కారం వరించింది.
మరిన్ని వార్తల కోసం..
ప్రజలకోసం పనిచేస్తే జరిమానా తగ్గిస్తాం
తలకిందులుగా త్రివర్ణ పతాకం ఎగరేసిన మంత్రి