KINGDOM: కింగ్‍డమ్ 40 నిమిషాలు చూశా.. ‘అద్భుతం.. అరాచకం’ అంతే: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్

KINGDOM: కింగ్‍డమ్ 40 నిమిషాలు చూశా..  ‘అద్భుతం.. అరాచకం’ అంతే: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్

హీరో విజయ్ దేవరకొండ లైగర్, ఫ్యామిలీ మెన్ సినిమాలతో ప్రేక్షకులను బాగా నిరాశపరిచాడు. ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో విజయ్ ఉన్నాడు. ఇప్పటికే కింగ్‍డమ్ నుంచి రిలీజైన సాంగ్, టీజర్కు భారీ ప్రేక్షకాదరణ తెచ్చుకున్నాడు. తన నటనలోని స్వాగ్ ఏంటనేది రిలీజైన టీజర్ చెప్పకనే చెప్పింది.  అంతేకాకుండా టీజర్తో సినిమా సక్సెస్ అవ్వడం గ్యారెంటీ అంటూ తన ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యేలా చేశాడు. 

ఈ క్రమంలోనే కింగ్డమ్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిరుధ్కు తన నెక్స్ట్ సినిమాల గురించి సంబంధించిన ఓ ప్రశ్న ఎదురైంది.

' కింగ్డమ్ చివరి 40నిమిషాల మూవీని చూశానని..అద్భుతంగా ఉందని.. విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ అరాచకం..ముఖ్యంగా యాక్షన్ సీన్స్ సూపర్బ్ అని' అనిరుధ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రేజీ అప్డేట్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే అనిరుధ్ బీజీఎం, మ్యూజిక్ ను కంప్లీట్ చేస్తున్నారు. 

కింగ్‍డమ్ ఫస్ట్ సింగిల్ ‘హృదయం లోపల’ పాట శ్రోతల్ని అలరిస్తోంది. ఈ పాటను అనిరుధ్, అనుమిత నదేషన్ పాడగా.. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. అనిరుధ్ ఇచ్చిన ఈ మెలోడీలో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య మంచి రొమాంటిక్ కెమిస్ట్రీ కుదిరింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. 

డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కింగ్‍డమ్ సినిమాను హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మే 30న సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో ఈ మూవీ రిలీజ్ కానుంది.