చాంగ్వాన్: టీనేజ్ షూటర్లు అనీశ్ భన్వాలా, రిథమ్ సాంగ్వాన్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో బ్రాంజ్ నెగ్గారు. మంగళవారం జరిగిన 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఈ పతకం సాధించారు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఇండియా ద్వయం 16–12తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన అనా డెడోవా–మార్టిన్ పొద్రాస్కి జంటను ఓడించింది. షూటింగ్ వరల్డ్ కప్‌లో అనీశ్, రిథమ్‌కు ఇది రెండో మెడల్. ఈ ఏడాది మార్చిలో కైరో వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లోనూ 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ గెలిచారు.
