అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సేవలపై అవగాహన కల్పించాలి : అనిత రామచంద్రన్

అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సేవలపై అవగాహన కల్పించాలి : అనిత రామచంద్రన్
  •     మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్

రాజన్న సిరిసిల్ల,వెలుగు: అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాల్లో అందే సేవలపై విస్తృత ప్రచారం కల్పించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సిరిసిల్ల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సేవలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌‌‌‌‌‌‌‌వాడీల్లో ప్రతివారం ఎగ్ బిర్యానీ పెట్టాలన్నారు. పోషణ్‌‌‌‌‌‌‌‌ ట్రాకర్, ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌టీఎస్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌లో లబ్ధిదారుల సంఖ్యను పోల్చి చూసి పరిశీలించారు. సఖి ద్వారా అందుతున్న సేవలను తెలుసుకున్నారు. 

బాల్యవివాహాలు జరగకుండా గ్రామాల్లో భేటీ బచావో బేటి పడావో ద్వారా ప్రత్యేక కళాజాత కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులపై ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా ఇంటర్నల్ కమిటీ లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేడీ ఝాన్సీ, జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం, సీడీపీవోలు ఉమారాణి, సౌందర్య, కోఆర్డినేటర్ రోజా, డీసీపీవో కవిత, సఖి కోఆర్డినేటర్ మమత, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ బాలకిషన్ పాల్గొన్నారు.