ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ : శ్రీధర్

ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ : శ్రీధర్

మంచిర్యాల, వెలుగు : తెలంగాణలో ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని అంజనీపుత్ర ఎస్టేట్స్​ చైర్మన్​ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంజనీపుత్ర ఆఫీసులో ‘రాయే రాయే పూల వర్షమా’ బతుకమ్మ పాటను రిలీజ్​ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ రూపంలో ప్రకృతిని పూజించే సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు.

మహిళల కోసం రూపొందించిన ఈ పాటను ప్రతిఒక్కరూ ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సింగర్​ నిరోషా యాదవ్, మ్యూజిక్​ డైరెక్టర్​ మామిండ్ల లక్ష్మణ్, మిట్టపెల్లి వెంకటేశ్​, హరీశ్​ పటేల్  పాల్గొన్నారు. 

టీషర్ట్స్​, క్యాప్స్​ అందజేత...

చెన్నూర్​ టీఎస్ డబ్ల్యూ ఆర్జేసీ గర్ల్స్​ హాస్టల్ లో నిర్వహించిన 9వ జోనల్  గేమ్స్, స్పోర్ట్స్ మీట్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా శ్రీధర్, రవి హాజరయ్యారు. అంజనీపుత్ర ఎస్టేట్స్​ తరపున వంద మంది క్రీడాకారులకు టీషర్టులు, క్యాపులు అందజేశారు.