రామ్ మిరియాల (RAM MIRIYALA) మంచి పాటగాడే కాదు..చక్కటి గీత రచయిత కూడా..అంతే కాకుండా అరుదైన ఓ సంగీత దర్శకుడు. ఆయన పాడే పాటలో ఏదో కొత్త దనం ఉంటోంది. ఆ యాసలో ఏదో మజా ఉంటోంది. అది మన తెలుగు ప్రజలందరిని ఆకట్టుకున్న గొంతు. ప్రస్తుతం తెలంగాణాలో జరగబోయే ఎలక్షన్స్ ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో..అందరికీ తెలిసిందే. ఇక ఈ సారైనా..నీ ఓటుతో తలరాతను మార్చుకో..నీ ఓటుకు రేటు పెట్టబోకు..పెంచుకోమాకు..అంటూ రామ్ మిరియాల పాటను పాడిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది.
ఓటరన్నా..ఈ సారి నీ ఓటు రేటెంత..నీ లీడర్ ఇచ్చే చీప్ కొటారు రేటంత..వాడు బిచ్చమేసే రెండు వేల నోటంత..అని ఆలోచింపజేస్తూనే..గెలిచేదాకానే నీ కాళ్ళు మొక్కి నిన్ను దేవుడంటారు..నీ పేరు చెప్పుకుని ప్రసాదాలు వాళ్ళే తింటరు..గెలిచి అసెంబ్లీలా ఒకరినొకరు తిట్టుకుంటరు..ఇక..ఆపై నిన్ను,నీ సమస్యలను బొందపెడ్తరు..అంటూ నిజాయితీగా ఓటు వేయకపోతే జరిగే పరిణామం ఎలా ఉంటుందో..కళ్ళకు కట్టినట్లు పాడి వినిపించారు రామ్.
నాయకులు ఏదేదో ఇస్తారంటే మురిసిపోతావు..ఐదేళ్లు ఆశతోనే మురిసిపోతావు..విద్యా,ఆరోగ్యం సంగతి అస్సలు అడగవు..ఇక నీ బిడ్డల భవిష్యత్తును నువ్వే అమ్ముకుంటావు అంటూ..ఓటును కాపాడుకో..లేదంటే నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసుకోకు అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ పాటకు మామా సింగ్ (కృష్ణ చైతన్య) లిరిక్స్ అందించగా..రామ్ మిరియాల పాడారు.
