మగతోడు లేకుండానే సంతానం

మగతోడు లేకుండానే సంతానం

సంతానోత్పత్తికి ఆడ, మగ కలయిక సహజం. ఇటీవల మగతోడు లేకుండానే పిల్లల్ని పెట్టిన అనకొండ వార్తల్లో నిలిచింది. అమెరికాలోని బోస్టన్ లో ఉన్న న్యూ ఇంగ్లం డ్ అక్వేరియంలో పది అడుగులుండే‘అన్నా’ అనకొండ ఉంటోంది. ఈ అక్వేరియంలో మగ అనకొండలు లేవు. ఉన్నవన్నీ ఆడవే. కొన్నే ళ్లుగా కొత్త సంతానం లేదు.దీంతో అక్వేరియం నిర్వహకులు అన్నాను పార్థెనోజెనెసి స్ (వర్జిన్ బర్త్) టెక్నిక్ ద్వారా గర్భం దాల్చేలా చేశారు. ఇటీవల అన్నాఈనింది. రెండు పెద్ద పిల్లల్ని పెట్టింది. పుట్టగానే అవీ ఈదడం మొదలు పట్టేశాయి.వెన్నెముక లేని జీవుల్లో ఇది చాలా అరుదు. తొలిసారి 2014లో ఇంగ్లం డ్ లోని జూలోగ్రీన్ అనకొండ ఒకటి ఇదే విధానంలో పిల్లలు పెట్టిం ది. ఈ అరుదైన ఘటనపై బోస్టన్ గ్లోబ్ పత్రిక కథనాన్ని పబ్లిష్ చేసిం ది.